: భారత రత్నానికి ధోనీ జేజేలు
తన మాజీ సహచర ఆటగాడు, సచిన్ టెండుల్కర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను స్వీకరించడంతో.. టీమిండియా కెప్టెన్ ధోనీ స్పందించాడు. ఆదర్శమూర్తికి ఈ గౌరవం తగినదిగా పేర్కొన్నాడు. ఇది చాలా గొప్ప వార్తని, క్రీడల్లో మొదటిసారి ఒక ఆటగాడు భారతరత్నను అందుకున్నాడని ధోనీ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ధోనీ ఆక్లాండ్ లో మీడియాతో మాట్లాడాడు. విదేశంలో ఉండడంతో అవార్డు బహూకరణ కార్యక్రమంలో పాల్గొనలేకపోయామని చెప్పాడు. ఒక పౌరుడిగా భారత్ లో ఇంతకుమించిన గొప్ప గౌరవాన్ని పొందలేమన్నాడు. మైదానంలోనే కాదు, బయట కూడా సచిన్ తనను మలుచుకున్న తీరు ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమని ధోనీ సూచించాడు.