: భారత నాయకత్వం ప్రపంచ క్రికెట్ కు మంచిది: బీసీసీఐ అధ్యక్షుడు
అంతర్జాతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు(ఐసీసీ)పై భారత్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న వారికి.. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కాస్త కర్రుకాచి వాతపెట్టినట్లుగా హితవు పలికారు. ఐసీసీ పాలకమండలి నిర్మాణంలో నూతన మార్పుల వల్ల దానిపై బీసీసీఐ ఆధిపత్యం కలిగి ఉండడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల ఐసీసీకి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇది ఆఫ్రికా సహా కొన్ని దేశాలకు గిట్టడం లేదు. దీనిపై శ్రీనివాసన్ మాట్లాడుతూ.. కొత్త నిర్మాణం తీరు ప్రపంచ క్రికెట్ కు మంచిదన్నారు. క్రికెట్ కు నాయకత్వంలో భాగం కావడాన్ని బీసీసీఐ సంతోషిస్తుందని, బలమైన భారత్(ఆధిపత్యం) ప్రపంచ క్రికెట్ కు మంచి చేస్తుందని శ్రీనివాసన్ చెప్పారు.