: ఏపీ భవన్ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ అంశం ఢిల్లీలోని ఏపీ భవన్ ను కుదిపేస్తోంది. ఈ రోజు ఉదయం తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంత నేతలు, అనుకూలంగా తెలంగాణ ప్రాంత నేతలు పోటాపోటీగా ధర్నా చేపట్టారు. జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తిస్తున్నారు. సీఎంకు వ్యతిరేకంగా తెలంగాణవాదులు నినాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి విడిది చేసిన గది వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారిని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో, ఇరు ప్రాంత నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది.