: షూటింగులో నటుడు సుదీప్ కు గాయాలు
'ఈగ' ఫేం నటుడు సుదీప్ గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కన్నడ చిత్రం 'మాణిక్య' షూటింగు బెంగళూరులోని అభయ నాయుడు స్టూడియోలో జరుగుతోంది. నిన్న (మంగళవారం) సాయంత్రం 6.30 గంటల ప్రాంత్రంలో చిత్రీకరణలో బైక్ స్టంట్ చేస్తుండగా బాలెన్స్ తప్పిన సుదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.