: ఏప్రిల్ 20తో చంద్రబాబు పాదయాత్ర ముగింపు
విశాఖ జిల్లాలో చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పాదయత్ర ముగింపు సభ ఏప్రిల్ 20న జరుగనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్విరామంగా సాగిన చంద్రబాబు పాదయాత్ర చరమాంకానికి చేరుతుంది. అయితే ఇంకా 6 జిల్లాల్లో చంద్రబాబు పాదయాత్ర చేయాల్సిఉంది. ఆయా జిల్లాల్లో బాబు బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 19వ తేదీకి బాబు పాదయాత్ర 200రోజులు పూర్తిచేసుకుంటుంది. గాంధీ జయంతి రోజున ప్రారంభమైన యాత్ర ఏప్రిల్ 20 చంద్రబాబు పుట్టిన రోజుతో ముగుస్తుందన్నమాట.
కాగా, చంద్రబాబు `వస్తున్నామీకోసం` పేరుతో గతేడాది అక్టోబర్ 2 గాంధీజయంతి రోజున అనంతపురంజిల్లా హిందూపురంలో పాదయాత్ర మొదలుపెట్టారు. కొన్ని అడ్డంకులు ఎదురైనా, ఇప్పటివరకూ 2వేల కిలోమీటర్లు పైగా బాబు తన పాదయాత్ర అప్రతిహతంగా సాగించారు. ప్రస్తుతం బాబు పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.

- Loading...
More Telugu News
- Loading...