: ఈ తేనె.. కిలో రూ.4.21లక్షలు!


మన దగ్గర తేనె మహా అయితే కిలో 300 లేదా 400 రూపాయలకు మించి ఉండదు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకునే తేనెను కొనుక్కోవాలంటే లక్షల రూపాయలు కూడబెట్టుకోవాలి. ఎందుకంటే, ఈ తేనె ధర కిలో 6,800 డాలర్లు. మన కరెన్సీలో చూస్తే రూ. 4.21లక్షలు. దీనిపేరు ఎల్విష్ హనీ! టర్కీలో లభిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేనె ఇదే. టర్కీ ఈశాన్య ప్రాంతంలోని ఆర్ట్విన్ పట్టణానికి సమీపంలో సరికేయర్ లోయలో 1.8 కిలోమీటర్ల లోతైన గుహ నుంచి ఈ తేనెను అతికష్టం మీద సేకరిస్తారు. ఈ తేనెను గునే గుండజ్ అనే వ్యక్తి 2009లో కనుగొన్నాడు.

గునే గుండజ్ స్థానికంగా తేనెటీగల పెంపకందారుడు. 2009లో తేనెటీగలు ఈ గుహలోకి వెళ్లడాన్ని గుర్తించాడు. కొంతమంది సాయంతో లోపలకు దిగి చూడగా గోడలకు తేనెపట్లు దర్శనమిచ్చాయి. సేకరించగా 18 కిలోల తేనె లభించింది. ల్యాబ్ పరీక్షల్లో ఈ తేనె పోషకాల అమృతంగా తేలింది. 7 ఏళ్ల పాతదని, అయినా అత్యంత నాణ్యతతో, పుష్కలమైన మినరల్స్ తో ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఇది తెలిసిన తర్వాత చైనా ఔషధ కంపెనీలు కూడా గుండజ్ నుంచి తేనెను కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. దాంతో డిమాండ్ పెరిగిపోయింది. ఈ గుహలో ఎన్నో ఔషధ మొక్కలు, ఖనిజాలు ఉన్నాయని, సహజ పద్ధతుల్లో తేనెను సేకరించడం వల్లే ధర ఎక్కువగా ఉన్నట్లు గుండజ్ తెలిపాడు. దీన్ని ఔషధంగానూ, ఆహారంగానూ వాడుకోవచ్చని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News