: కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశం ప్రారంభం


ఢిల్లీలో కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మొదలైన ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ రేపు చేపట్టబోతున్న మౌన దీక్షలో ఎంపీలు కూడా పాల్గొననున్నారు. దాంతో, దీక్షను విరమింపజేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా, యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఎంపీలకు ఈ భేటీకి ఆహ్వానం లేదు.

  • Loading...

More Telugu News