: రేపు అన్ని పార్టీలు కలసిరావాలి: శైలజానాథ్
రేపు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మౌన దీక్ష చేపడుతున్నామని మంత్రి శైలజానాథ్ తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సతో పాటు వంద మంది సీమాంధ్ర నేతలతో కలసి రాష్ట్రపతిని కలుస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నేతలందరూ పార్టీలకతీతంగా కలసి రావాలని కోరారు.