: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను మేము కోరుకోవడం లేదు: ములాయం స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తాము కోరుకోవడం లేదని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకం అంటూ తమ విధానాన్ని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన దేశాన్ని అస్థిరతలోకి నెడుతుందన్నారు. అభివృద్ధి ప్రాతిపదిక అయితే నిధుల కేటాయింపు అదనంగా జరపాలని ఆయన సూచించారు. వాదాలతో దేశాన్ని ఎన్ని ముక్కలు చేయగలమని ఆయన ప్రశ్నించారు.