: డీఎంకే వెళ్లినా నష్టం లేదు: చిదంబరం
యూపీఏ నుంచి డీఎంకే బయటకు వెళ్లినా ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిలేదని ఆర్ధికమంత్రి చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. తమకు పూర్తి మెజారిటీ ఉందన్నారు. ప్రభుత్వం అధికారంలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. శ్రీలంక తమిళుల వ్యవహారంపై పార్లమెంటులో తీర్మానానికి సంబంధించి డీఎంకేతో చర్చలు జరుగుతున్నాయని చిదంబరం తెలిపారు. లంక తీరుకు నిరసనగా యూపీఏ నుంచి వైదొలగుతున్నట్లు ఈ ఉదయం డీఎంకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.