: సభను అడ్డుకుంటే తెలంగాణ సమస్య పరిష్కారం కాదు: కమల్ నాథ్
పార్లమెంటును అడ్డుకుంటే తెలంగాణ సమస్య పరిష్కారం కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతి ఎంపీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బిల్లు కారణంగా సభ జరగదనే అపోహ అందర్లోనూ ఉందని, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సహకరించి ప్రతిపక్షాల అంచనాలు తల్లకిందులు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ అంశం పార్టీల సమస్య కాదని, ప్రాంతాల సమస్య అని ఆయన అన్నారు. సభను అడ్డుకోవాలనుకుంటే సస్పెండ్ చేయడానికి వెనుకాడమని ఆయన హెచ్చరించారు.