: జగన్ కు చుక్కెదురు
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు మరోసారి నిరాశ తప్పలేదు. నాంపల్లి సీబీఐ కోర్టులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో జగన్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.