: 21వ తేదీన ప్రయాణాలు వాయిదా వేసుకోండి
ఎల్లుండి ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ సలహాఇచ్చారు. ఆరునూరైనా ఆరోజున సడక్ బంద్ విజవంతం చేస్తామని తెలిపారు. ఈనెల 21వ జరుపతలపెట్టిన సడక్ బంద్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఫలప్రదం చేస్తామని ఇంతకుముందు టీఆర్ఎస్ నేతలు సైతం ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీమాంధ్ర ప్రభుత్వం బంద్ ను నిర్వీర్యం చేయాలని చూస్తోందని మరోప్రక్క గులాబీనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.