: సీఎం దీక్షపై అధిష్ఠానమే మాట్లాడుతుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేయతలపెట్టిన దీక్షపై కాంగ్రెస్ అధిష్ఠానమే మాట్లాడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అన్ని పార్టీల అంగీకారంతోనే విభజన నిర్ణయం జరిగిందని హస్తినలో ఉన్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు మీడియాతో అన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీల విషయాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. విభజనపై కిరణ్ కుమార్ రెడ్డి, జగన్, చంద్రబాబు మాట మార్చారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం, ప్రతిపక్ష నేత, పీసీసీ అధినేత, సభాపతులు అందరూ సీమాంధ్ర వారేనని వీహెచ్ అన్నారు.