: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ‘విజయీభవ’ కార్యక్రమం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దేవాలయంలో ‘విజయీభవ‘ కార్యక్రమం వైభవంగా జరిగింది. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం నాడు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఆలయంలో ‘విజయీభవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచిత దర్శనంతో పాటు కలం, లడ్డూ ప్రసాదం, అమ్మవారి ఫొటో, కంకణాన్ని ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు అందజేశారు.