: తెలంగాణ ఆగిపోతుంది: గంటా
రాష్ట్ర విభజన ఆగిపోతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే పరిస్థితి లేదని అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బిల్లు, అవినీతి వ్యతిరేక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉందని, అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ బిల్లు పార్లమెంటులో చర్చకు వస్తుందని తాను భావించడం లేదని అన్నారు. వచ్చినా అడ్డుకునేందుకు తమ ప్రాంత ఎంపీలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ, కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ భేటీ కానున్నామని ఆయన తెలిపారు. వారితో భేటీలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలను ఎండగడతామని గంటా వెల్లడించారు.