: మునిగిపోయే నావకు ఆ ముఖ్యనేత కెప్టెన్ కావాలనుకుంటున్నారు: లగడపాటి


రాష్ట్ర కాంగ్రెస్ లో ఓ ముఖ్యనేత ఇప్పుడు చక్రం తిప్పుతున్నారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అంటున్నారు. మునిగిపోయే నావకు ఆ నేత కెప్టెన్ కావాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆయన యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ముఖ్యనేత గతరాత్రి కేసీఆర్ తో ఓ హోటల్లో సమావేశమయ్యారని వెల్లడించారు. అయితే, ఆ నేత పేరును మాత్రం లగడపాటి వెల్లడించలేదు. దీంతో, రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఆ ముఖ్యనేత ఎవరన్న విషయమై గుసగుసలు బయల్దేరాయి!

  • Loading...

More Telugu News