: పేలుళ్ళ కేసులో భత్కల్ బంధువు అబుదాబిలో అరెస్టు


భారత్ లో పలు పేలుళ్ళకు పాల్పడిన ఇండియన్ ముజాహిదిన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ కు బంధువైన అబ్దుల్ వాహిద్ సిద్దిబాపాను అబుదాబిలో అరెస్టు చేశారు. కర్ణాటక తీరప్రాంతం భత్కల్ కు చెందిన వాహిద్ పై పేలుళ్ళకు నిధులు సమకూర్చడం వంటి ఆరోపణలున్నాయి. 2006 ముంబయి వరుస పేలుళ్ళు, 2008 ఢిల్లీ పేలుళ్ళ, 2010 బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పేలుళ్ళ కేసుల్లో వాహిద్ పై ఇంటర్ పోల్ అంతర్జాతీయంగా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. అబుదాబి అధికారులు అదుపులోకి తీసుకున్నది వాహిదే అని నిర్ధారించుకోవడానికి ఎన్ఐఏ అధికారులు అబుదాబి బయల్దేరి వెళతారని కేంద్ర హోం శాఖ తెలిపింది. వాహిద్ ఏవో వ్యాపార పనులున్నాయంటూ తరచూ అబుదాబిని వెళ్ళివస్తుంటాడని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News