: ఈ పరిస్థితుల్లో విచారణ ఎందుకు?.. పార్లమెంటు సమావేశాల తరువాత విచారించండి: రాఘవులు


విద్యుత్ ఛార్జీల పెంపుపై శాస్త్రి భవన్ లో నిర్వహించిన ఈఆర్సీ సమావేశం ఉద్దేశ్యాన్ని సీపీఎం రాఘవులు ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు ఇంత హడావుడిగా బహిరంగ విచారణ చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రైవేటు సంస్థలకు విద్యుత్ రంగంపై గుత్తాధిపత్యం కట్టబెట్టేందుకు అధికారులు సహకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం కలసికట్టుగా ఉంటుందో లేదో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టాల్సిన ఉద్దేశాన్ని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల తరువాత రాష్ట్రంపై అనిశ్చితి తొలగిన తరువాత ఈఆర్సీ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News