: ఇరకాటంలో కేంద్ర ప్రభుత్వం ... కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసర భేటీ
యూపీఏ2 ప్రభుత్వంలో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద భాగస్వామి అయిన డీఎంకే వైదొలగడంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. డీఎంకేకు పార్లమెంట్ లో 18మంది ఎంపీల బలముంది. తాజా పరిణామాలతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ, తన కోర్ కమిటీ సభ్యులతో అత్యవసరంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ మీద చర్చిస్తుంది.