: ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద టీడీపీ నేతల ధర్నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, దేశాన్ని ఏకం చేసేందుకు సంస్థానాలన్నింటినీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఏకం చేస్తే, కాంగ్రెస్ పార్టీ స్వార్థంతో రాష్ట్రాలను ముక్కలు చేస్తోందని మండిపడ్డారు. దేశాన్ని ఇలా ముక్కలు చేస్తూ పోతే ఏకతాటిపై ఎలా నిలబెడతారని ఆయన ప్రశ్నించారు. పరిపాలన చేతకాకుంటే రాజకీయాల నుంచి విరమించుకోవాలి గానీ, విభజన రాజకీయాలు చేయకూడదని ఆయన సూచించారు.