: డీఎంకే పార్టీ అత్యవసర భేటీ, యూపీఏ సర్కర్ నుంచి వైదొలగాలని నిర్ణయం


కేంద్ర ప్రభుత్వం నుంచి డీఎంకే పార్టీ వైదొలిగింది. కొంచెం సేపటి క్రితం చెన్నైలో అత్యవసభేటీ నిర్వహించిన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఈమేరకు అధికార ప్రకటన చేశారు.
 
ఫలితంగా కేంద్రమంత్రులు గా కొనసాగుతోన్న 5 మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయనున్నారు. తమిళుల హక్కుల పరిరక్షణ కోసమే తామీ నిర్ణయం తీసుకున్నామని కరుణానిధి తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వ పనితీరుమీద ఆయన తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. శ్రీలంకలో తమిళుల ఊచకోతపై కేంద్రం ఏమీ చేయలేకపోతుందని మండిపడ్డారు. తమిళుల హక్కులను కేంద్రం పట్టించుకోనందునే తాము కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నామని కరుణానిధి వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమావేశంలో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఆయన కేంద్రాన్ని ఈ సందర్భంలో డిమాండ్ చేశారు. 

డీఎంకే సర్కారు వైదొలిగే సూచనలను ముందుగానే గ్రహించిన సోనియాగాంధీ న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో తమ పార్టీ ఎంపీలతో ఇవాళ ప్రత్యేక భేటీ జరిపి శ్రీలంక తమిళుల ఊచకోతను ముక్తకంఠంతో ఖండించారు. ముందస్తు ఎన్నికలకు సిద్దంకావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

అయినప్పటికీ డీఎంకే పార్టీ యధావిధిగా తను అనుకున్న నిర్ణయం చేసేసింది. 

  • Loading...

More Telugu News