: అరుణ్ జైట్లీ నివాసం ఎదుట ఆమ్ ఆద్మీ కార్యకర్తల నిరసన
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ నివాసం ఎదుట ఆమ్ ఆద్మీ కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. దాంతో, అదే ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు కౌంటర్ నిరసన చేపట్టారు. తమ ఎమ్మెల్యేలను లోబరుచుకునేందుకు అరుణ్ జైట్లీ ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఏఏపీ ఆరోపించింది. ఈ క్రమంలో జైట్లీ నివాసం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.