: అవినీతి నిరోధక బిల్లుల ఆమోదానికి సహకరించాలి: రాహుల్ గాంధీ
అవినీతి నిరోధక బిల్లుల ఆమోదానికి విపక్షాలు సహకరించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను రాహుల్ కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి ఢిల్లీలో దాడికి గురై మరణించాడు. దీని విషయమై కేంద్ర హోం శాఖామంత్రితో రాహుల్ మాట్లాడారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరుగకుండా హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ విద్యార్థులకు హామీ ఇచ్చారు.