: 6వ తేదీ నుంచి ఏపీఎన్జీవోల నిరవధిక సమ్మె
ఏపీఎన్జీవో భవన్లో ఉద్యోగ సంఘాలు సమావేశమై తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విషయం తెలిసిందే. సమావేశమైన అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. సమ్మెకు సంబంధించి రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ను కలిసి నోటీసును అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమ్మె పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అశోక్ బాబు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకోవాల్సిన బాధ్యత సీమాంధ్ర నేతలదేనని ఆయన స్పష్టం చేశారు.