: తెలంగాణ బిల్లును గెలిపించాల్సిందే: చిదంబరం


తెలంగాణ బిల్లును పార్లమెంటులో గెలిపించాలని కేంద్ర మంత్రి చిదంబరం పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఒక ప్రాంతం తెలంగాణను కోరుతుంటే.. మరో ప్రాంతం తెలంగాణను వ్యతిరేకిస్తోందని అన్నారు. తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు ఉండగా, సీమాంధ్ర నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారని ఆయన చెప్పారు. ఎంపీలంతా వారి ప్రాంతాలకు అనుకూలంగా వ్యవహరిస్తే ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ సమస్యపై ఈసారి పరిష్కారం చూపించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ వేశామన్న ఆయన, కమిటీ చర్యలను ఎంత వరకు అమలు చేశారనే దానిపై మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేదు.

  • Loading...

More Telugu News