: తూర్పు గోదావరి జిల్లా దొంతుమూరులో ఉద్రిక్తత


తూర్పు గోదావరి జిల్లా దొంతుమూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేయ తలపెట్టిన విద్యుత్తు, ఎరువుల కర్మాగారం విషయంలో నేడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దొంతుమూరు, పరిసర గ్రామాల ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు.

ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని స్థానికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ పోలీసులను భారీగా మోహ
రించారు. స్థానికుల నిరసన కొనసాగుతోంది. వాస్తవానికి ఇక్కడ  పరిశ్రమల ఏర్పాటును స్థానికులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. 

  • Loading...

More Telugu News