: వార్ రూం సమావేశానికి రండి: సీఎమ్ బృందానికి అధిష్ఠానం ఆదేశం
వార్ రూం సమావేశానికి రేపు సాయంత్రం 7:30 నిమిషాలకు రావాలని సీఎంతో పాటు సీమాంధ్ర నేతలను కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. తెలంగాణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నేతలంతా, అధిష్ఠానంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న నేపధ్యంలో వార్ రూం సమావేశానికి సీమాంధ్ర నేతలను ఆహ్వానించడం ఆసక్తిని రేపుతోంది. అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో సీమాంధ్ర నేతలు తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సహకరిస్తారా? లేదా? అనేది రెండు ప్రాంతాల నేతల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.