: నదిలో పడిన బస్సు..37 మంది దుర్మరణం


మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం 37 మంది ప్రాణాలను బలిగొంది. గోవా నుంచి ముంబై వెళుతున్న బస్సు రత్నగిరి జిల్లా ఖేడ్ సమీపంలో ఈ ఉదయం వంతెనపై నుంచి జాగ్బూడి నదిలోకి పడిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే 37 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 17 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్తనాదాలతో, అరుపులతో, రక్షించమంటూ వేడుకోళ్లతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.

వేకువజామున 3.30గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే అది అదుపుతప్పి నదిలోకి పడిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. 

  • Loading...

More Telugu News