: నిలకడగా జయేంద్ర సరస్వతి ఆరోగ్యం
కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (79) ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనను నెల్లూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి చెన్నైలోని శ్రీరామచంద్రా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి ఈ ఉదయం తరలించారు. స్వామి నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. నెల్లూరు పర్యటనకు వచ్చిన జయేంద్ర సరస్వతి స్వామివారు నిన్న సాయంత్రం స్పృహ తప్పిపోతున్నట్లుగా అనిపించగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పడిపోయినట్లు పరీక్షల్లో వెల్లడవగా.. వైద్యులు వెంటనే చికిత్స అందించారు.