: టీచర్లను తీసేసే అధికారం తల్లిదండ్రులకు ఉండాలి: మనీష్ సిసోడియా
పాఠశాలల్లో ప్రిన్సిపాళ్లను, టీచర్లను సస్పెండ్, తొలగించే అధికారం తల్లిదండ్రులకు ఇవ్వాలని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఢిల్లీలోని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు గమనించారు. ప్రిన్సిపాళ్లు సహా, పలువురు టీచర్లు స్కూళ్లకు ఆలస్యంగా వస్తుండడంతో పిల్లలే పాఠాలు చెప్పుకోవడం, పరీక్షలు నిర్వహించుకోవడం గమనించారు.
వారం రోజుల పాటు టీచర్లు స్కూళ్లకు హాజరుకానప్పటికీ హాజరుపట్టీలో మాత్రం 9:30కే హజరవుతున్నట్టు సంతకాలు ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మధ్యహ్న భోజన పథకంలో కూడా పలు అవకతవకలు గుర్తించిన ఆయన కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారని, వారిపై అధికారం కూడా పిల్లల తల్లిదండ్రులకే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.