: కరెంట్ షాక్ తో దొంగల మృతి.. రహస్యంగా పాతిపెట్టిన గ్రామస్తులు
దోపిడీకి వెళ్ళిన దొంగలు కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎగువ పాలకూరులో ఈ ఘటన జరిగింది. కొద్ది రోజుల క్రితం ముగ్గురు దొంగలు ఈ గ్రామంలోకి చోరీకి వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తు వారు విద్యుదాఘాతంతో మరణించారు. కాగా, ఈ విషయం బయటికి పొక్కితే సమస్యలు వస్తాయని భావించిన గ్రామస్తులు ముగ్గురి శవాలను రహస్యంగా పాతిపెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.