: ఈ మోటార్ సైకిల్ కి ఒకే చక్రం!
సైకిల్ అయినా, బైక్ అయినా.. వాహనం అంటే తక్కువలో తక్కువ రెండు చక్రాలు ఉండడం సహజం. కానీ, ఒక్క చక్రం చాలంటోంది అమెరికాకు చెందిన రైనో మోటార్స్ కంపెనీ. ఈ కంపెనీ ఒకే ఒక చక్రంతో విద్యుత్ శక్తితో పనిచేసే బైక్ ను తయారు చేసింది. ధర 3.3లక్షల రూపాయలు. ఈ ధరకు మన దగ్గర కారు కూడా వచ్చేస్తుంది.. అది వేరే సంగతి లేండి. ఈ ఏకచక్ర బైక్ తో ట్రాఫిక్ చిక్కులుండవని చిన్న సందుల్లోనూ దూసుకుపోవచ్చంటోంది రైనో మోటార్స్. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఇది వెళుతుందట. చక్రంపైనే సీటు ఉంటుంది. దానిపై కూర్చుని ముందుకు వంగితే వేగం పెరుగుతుంది. వెనక్కి వంగితే తగ్గుతుంది.