: ముఖం చూసి మూడ్ చెప్పేస్తుంది!
బాధ, చిరాకు, కోపం, అసహనం, సంతోషం ఏదైనా సరే.. మీ ముఖం చూసి మీ మనసు జాతకం చెప్పేసే సాఫ్ట్ వేర్ ను అమెరికాకు చెందిన ఎమోటెంట్ కంపెనీ అభివృద్ధి చేసింది. డిజిటల్ కెమెరాతో మీ ముఖాన్ని క్లిక్ మనిపించి క్షణాల్లోనే మీరే భావనతో ఉన్నారో ఇట్టే చెప్పగలదట. దీని పేరు ఫేసెట్. లోపల బాధను దాచుకుని పైకి నవ్వులు చిందించినా.. మోసపోకుండా బాధలో ఉన్నారని తేల్చిపడేసే సత్తా ఫేసెట్ కు ఉందని కంపెనీ చెబుతోంది.