: బిన్నీకి వేయి ఏనుగుల బలం!


ఆమ్ ఆద్మీపై నిప్పులు కక్కుతున్న బహిష్కృత ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీకి వెయ్యి ఏనుగుల బలం చేకూరింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ సర్కారుపై అసంతృప్తి వెళ్లగక్కారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఢిల్లీ సర్కారును కూల్చివేస్తామని జేడీయూ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, స్వతంత్ర ఎమ్మెల్యే రంబీర్ షోకెన్ హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేర్చడానికి కేజ్రీవాల్ కు 48 గంటల గడువు ఇచ్చారు.

ఆ లోపు నీరు, విద్యుత్ తదితర అంశాలపై తగిన హామీ లభిస్తే కేజ్రీవాల్ సర్కారుకు తమ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. వీరు మరో ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ తో నిన్న రాత్రి భేటీ అయ్యి చర్చలు జరిపారు. అయితే, సర్కారుకు వచ్చిన ముప్పేమీ లేదని మంజిందర్ తేల్చి చెప్పారు. ఇక్బాల్, షోకెన్ ఇద్దరూ బల నిరూపణ సమయంలో కేజ్రీవాల్ సర్కారుకు మద్దతు ఇచ్చినవారే. ప్రస్తుతం కేజ్రీవాల్ సర్కారుకు సరిపడా మెజారిటీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 8 మంది ఎమ్మెల్యేలు గల కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇస్తోంది.

  • Loading...

More Telugu News