: కేజ్రివాల్ పై పాక్ మీడియా మిశ్రమ స్పందన


సామాన్యుడి శ్రేయస్సే లక్ష్యంగా రాజకీయ రణరంగంలోకి దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ పై పాకిస్తాన్ మీడియా మిశ్రమ స్పందన కనబరిచింది. పాక్ మీడియాలో ఓ వర్గం కేజ్రివాల్ ను 'ఆకట్టుకోలేని ముఖ్యమంత్రి'గా అభివర్ణించగా, మరో వర్గం ఆయన నిరాడంబరతను కొనియాడింది. రెండ్రోజుల క్రితం డిల్లీలో ఆయనను పాక్ మీడియా కలసింది. ఈ సందర్భంగా పాక్ పాత్రికేయులు కేజ్రివాల్ పై పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన అభిప్రాయాన్ని కోరగా, రెండు దేశాల మధ్య సంబంధాలపై తనకు పెద్దగా అవగాహన లేదని చెప్పారు. తానెప్పుడూ పాక్ ను సందర్శించలేదని తెలిపారు. అయితే, అన్ని దేశాలతోను భారత్ సత్సంబంధాలు కొనసాగించాలని తాను కోరుకుంటానని పేర్కొన్నారు. 'డాన్' పత్రిక మరోసారి ప్రశ్నించడంతో.. ద్వైపాక్షిక సంబంధాల విషయం తన పరిధికి మించిన విషయమని సెలవిచ్చారు. అయినా అది కేంద్రం చూసుకోవాల్సిన విషయమని చెప్పుకొచ్చారు. అవినీతి నేతలపై తమ పోరు ఆగదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News