: అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన కనిమొళి


డీఎంకే అధినేత కరుణానిధి కూతురు కనిమొళి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలో నిన్న మధ్యాహ్నం ఇంట్లో స్పృహ తప్పి పడిపోయి ఉన్న ఆమెను ఆళ్వార్ పేటలోని ఒక ఆస్పత్రికి తరలించారు. తండ్రి కరుణానిధి ఆమెను పరామర్శించారు. కుటుంబంలో గొడవల వల్లే మనస్తాపం చెంది ఆమె నిద్ర మాత్రలు మింగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, డీఎంకే పార్టీ వర్గాలు మాత్రం, ఆమె ఎన్నికల ప్రచారంలో అలసిపోయి అస్వస్థతకు గురయ్యారని స్పష్టం చేశాయి. కొడుకు అళగిరిని కరుణానిధి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News