: ఈ నెల 4న లేదా 5న రాష్ట్రపతిని కలుస్తా: సీఎం
ఎన్నికల ద్వారా ప్రజల నిర్ణయం మేరకు రాష్ట్ర విభజన జరగాలని ముఖ్యమంత్రి కిరణ్ అభిప్రాయపడ్డారు. ఇష్టమొచ్చినట్టు చేస్తే తెలుగు ప్రజలు క్షమించరని అన్నారు. తీర్మానం విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీలు అసెంబ్లీలో ఎలా కలసి వచ్చాయో... ఇకపై కూడా అలాగే సమష్టిగా పోరాడాలని సూచించారు. ఆర్టికల్-3ని రాష్ట్రపతే పార్లమెంటుకు సిఫారసు చేస్తారని చెప్పారు. సుప్ర్రీంకోర్టు సలహా తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉందని తెలిపారు. ఈ నెల 4న లేదా 5న రాష్ట్రపతిని కలుస్తానని చెప్పారు. శాసనసభలో తీర్మానం ఏకాభిప్రాయం ద్వారానే వచ్చిందని అన్నారు.