: పార్లమెంటుకు బిల్లును పంపరాదని రాష్ట్రపతిని కోరతాం: కొనకళ్ల
తప్పుల తడకగా ఉన్న టీబిల్లును పార్లమెంటుకు పంపరాదని రాష్ట్రపతిని కోరతామని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. ఈ విషయమై రేపు తమ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ బృందం రాష్ట్రపతిని కలుస్తుందని చెప్పారు. ఈ రోజు హైదరాబాదులో జరిగిన సమైక్యాంధ్ర గెజిటెడ్ ఉద్యోగుల ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. గతంలో అవిశ్వాస తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చినట్లే... ఈసారి కూడా బిల్లును అడ్డుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తామని వెల్లడించారు.