: హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మనే అధికారం ఎవరికీ లేదు: వెంకయ్యనాయుడు


మోడీని దేశ ప్రజలందరూ ప్రధానిగా కోరుకుంటున్నారని... యూపీయేను చీదరించుకుంటున్నారని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో తెలంగాణకు జై... విజయవాడలో నై... ఇదే కాంగ్రెస్ విధానమని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారని... వారిని నగరం విడిచి వెళ్లమనే అధికారం ఎవరికీ లేదని అన్నారు. హైదరాబాదులో ఉండే వారికి బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలది తప్పులేదని... వారిని రెచ్చగొట్టిన నేతలదే తప్పని విమర్శించారు. సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం లాంటి ఉన్నత విద్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News