: విద్యుత్ ఛార్జీలపై నిరవధిక ధర్నాకు వామపక్షాలు రెడీ
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను నిరసిస్తూ నిరవధిక ధర్నా చేపట్టాలని వామపక్షాలు నిర్ణయించాయి. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వేదికగా ఈ ధర్నాలు ఈ నెల 23 నుంచి జరుగుతాయి. పన్నుల పేరిట ప్రభుత్వం ప్రజలపై అడ్డదిడ్డంగా వసూళ్ళకు పాల్పడుతోందని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈఆర్సీ కూడా సర్కారు విధానాలకు మద్దతు పలుకుతూ, ప్రజా వ్యతిరేక ధోరణి కనబరుస్తోందని ఆరోపించాయి.