: వ్యవసాయ శాఖకు ఇద్దరు మంత్రులు: జగన్
తాము వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని... అధికారంలోకి వస్తే ఈ శాఖకు ఇద్దరు మంత్రులను కేటాయిస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ చెప్పారు. అంతే కాకుండా, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పత్తి రైతులకు 7 గంటల పాటు ఉచిత విద్యుత్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. చిన్న పిల్లల చదువుకోసం ఎన్ని వేల కోట్లైనా కేటాయిస్తామని చెప్పారు. ఈ రోజు వైకాపా ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ, జగన్ హామీల వర్షం కురిపించారు. చంద్రబాబు, కిరణ్ లు రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చంద్రబాబు ఏ జాతీయ నేతనైనా కలిశారా? అని ప్రశ్నించారు. అంతే కాకుండా, రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీలుస్తోందంటూ సోనియాపై నిప్పులు చెరిగారు.