: అన్న కోసం ఎంత దూరమైనా వెళ్తా: షర్మిల
'బోనులో ఉన్నా సింహం సింహమే' అని జగనన్న నిరూపించుకున్నారని షర్మిల తెలిపారు. అత్యంత శక్తిమంతులతో పోరాటం చేస్తున్నా... అధైర్య పడటంలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో నాన్నను అన్నలో చూస్తారని తెలిపారు. సమైక్యవాదానికి కట్టుబడింది వైకాపాయేనని... వచ్చే ఎన్నికల్లో తప్పక గెలుస్తామని కార్యకర్తల్లో హుషారు నింపారు. ఇడుపులపాయలో జరుగుతున్న వైకాపా ప్లీనరీలో ఆమె మాట్లాడారు. తాను జగనన్న వదిలిన బాణాన్నని.. అన్న కోసం ఎంత దూరమైనా వెళతానని చెప్పారు. అన్నకు, తనకు మధ్య భేదాభిప్రాయాలున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.