: ఎల్లుండి నుంచి ఢిల్లీలో సీఎం కిరణ్ దీక్ష: లగడపాటి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోని ఇందిరాగాంధి సమాధి శక్తి స్థల్ వద్ద ఎల్లుండి నుంచి దీక్ష చేపడుతున్నారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఇందిరాగాంధీ ఆశయాలను కేంద్రానికి చెప్పడానికే ఈ కార్యక్రమమని వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే దీక్ష చేపడితే... కేంద్ర మంత్రులు కూడా రాక తప్పదని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమ తీవ్రత పెరిగితే కేంద్ర మంత్రులు తలొగ్గుతారని అభిప్రాయపడ్డారు.