: తెలంగాణ ప్రాంత టూరిజంకు రూ. 80 కోట్లు కేటాయించాం: చిరంజీవి
ప్రాంతాలకతీతంగా రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చెప్పారు. కరీంనగర్ జిల్లా వేములవాడ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయాలు ఉన్న ప్రాంతంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ ఏడాది తెలంగాణ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం రూ. 80 కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు.