: జగన్ నాయకత్వంలో సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకుందాం: విజయమ్మ
తమ నాయకుడు జగన్ నాయకత్వంలో సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకుందామని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిలుపునిచ్చారు. ఇడుపులపాయలో జరుగుతున్న వైకాపా ప్లీనరీలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమైక్యం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైకాపాయే అని చెప్పారు. కిరణ్, చంద్రబాబులే రాష్ట్ర విభజనకు ప్రధాన కారకులని ఆరోపించారు. టీబిల్లును కేంద్రానికి పంపడంలో సీఎం కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనిపిస్తోందని తెలిపారు. జగన్ ను అక్రమంగా జైల్లో నిర్బంధించారని... 90 రోజుల్లో రావాల్సిన బెయిలును రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. రైతన్నల సంక్షేమం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారని చెప్పారు.