: త్వరలో తెలంగాణలో జగన్ పర్యటన: మేకపాటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. కడపజిల్లా ఇడుపులపాయలో జరగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే వైఎస్సార్ కాంగ్రెస్ కు తెలంగాణలోనూ 70 సీట్ల వరకూ వస్తాయనే ఉద్దేశంతోనే.. కాంగ్రెస్ కుట్రపూరితంగా తెలంగాణ విభజనకు పూనుకుందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్ణపాలన మళ్లీ జగన్ వల్లే సాధ్యమన్నారు.