: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డీఏ ఎర!
ఎన్నికల ముంగిట ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగా వారికి డీఏ (కరువు భత్యం)ని ఏకంగా 10 శాతం పెంచాలని భావిస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలంటే ఉద్యోగుల ఆదరణ ఎంతో ముఖ్యమని భావించే కేంద్ర సర్కారు ఈ యోచన చేస్తోంది. 10 శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50 లక్షల మంది.. పింఛన్ దారులు 30 లక్షల మంది లబ్ధి పొందుతారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ గణనీయమైన ప్రయోజనం దక్కుతుంది. కేంద్రం ఖరారు చేసిన డీఏను ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ కూడా డీఏను పెంచుతారు. ఒకవేళ కేంద్రం 10 శాతం డీఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 9 శాతం వరకు పెరుగుతుంది.