: మాజీ మంత్రి బర్రెలు మాయం.. ఉరుకులు పెడుతున్న అధికారులు


బర్రెలు మాయమైతే.. ఇద్దరో ముగ్గురో కలిసి వెతుకులాట ప్రారంభిస్తారు. మరిక్కడ మాయమైన బర్రెలు ఏ సామాన్యుడివో కావు. ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీ నేతవి. మాజీ మంత్రి అజంఖాన్ ఫామ్ హౌస్ నుంచి బర్రెలు మాయమయ్యాయి. అంతే... జిల్లాలోని పోలీసు యంత్రాంగం అంతా కదిలింది. తప్పిపోయిన వాటి కోసం డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. జిల్లాలోని ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా వెతుకులాటలో పాలుపంచుకుంటున్నారు.

  • Loading...

More Telugu News