: ముంబయిలో మోనోరైల్ ను ప్రారంభించిన మహా సీఎం


దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన మోనోరైల్ సర్వీస్ ను ముంబయిలో ఈ రోజు (శనివారం) మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ ప్రారంభించారు. ముంబయి నగర ప్రజలకు కొత్తగా వచ్చిన ఈ సర్వీసు ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. మూడువేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును రెండు దశల్లో తీసుకువస్తున్నారు. మొదటి దశలో 8.9 కిలో మీటర్ల పొడవుతో వాదాల-చెంబూర్ వరకు ఉంటుంది. తొలి దశలో మొత్తం ఆరు రైళ్లను నడపనున్నారు. ఇక రెండో దశను దక్షిణ ముంబై లోని సంత్ గడ్జ్ మహారాజ్ చౌక్ వరకు పొడిగించారు.

  • Loading...

More Telugu News